Skip to main content

Posts

Showing posts from 2020

ఎక్కడ సేవింగ్ చేస్తే మంచిది.

సేవింగ్ చేయటం ఒక కళ, అందులో ముఖయమైనవి ఎక్కడ సేవ్ చేస్తే ప్రయోజనం అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే మంచిది. అతిగా ఆశ కు పోకూడదు. మంచి నమ్మకమైన చిత మాత్రమే సేవింగ్ చెయ్యాలి. పెక్కువ డబ్బుకు ఆశపడి నమ్మకం లేని చోట సేవింగ్ చేస్తే మొత్తానికే మోసం అవుతుంది. కనుక నమ్మకము ఉన్న బ్యాంక్/ పోస్టల్ డిపాజిట్ లను నమ్ముకుంటే మంచిది, బట్ ఇక్కడ రిస్క్ తక్కువ మరియు లాభం కూడా తక్కువ. కానీ నీ డబ్బుకు భద్రత ఎక్కువ.

సేవింగ్స్ ఏవిధంగా చెయ్యాలి.

చీమలు నిరంతరం ఒక రాయి పై నడుస్తూ ఉంటే రాయి ఎలాగ అయతే అరిగిపోతుందో అలా మన పొదుపు కూడా కొద్ది కొద్దిగా మొదలై మన గోల్ రీచ్ అయ్యేలా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. ఎప్పుడూ కూడా మిగిలిన దానిని సేవింగ్ చేద్దాం అనుకోకూడదు, సేవింగ్ చేసిన తరువాత మిగిలిన అమౌంట్ తో నీ నెలసరి గడుపుకోవలి. ఇలా కొన్ని రోజులు సేవింగ్ చేసిన తరువాత , పోగు అయన మొత్తాన్ని ఇన్వెష్ట్ గా మార్చాలి.

డబ్బు ఇన్వెష్ట్ చేయడం లో మొదటి మెట్టు.

ఒకటే సారి కోట్లు సంపాదించటం ఎవరివల్లా కాదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టకోవాలి, ఏ ప్రయాణం అయిన మొదటి అడుగు నుంచే ప్రారంభం అవుతుంది అలాగే డబ్బు పోగుచెయ్యడం అనేది కూడా ఒక్క రూపాయి నుంచే మొదలు అవుతుంది. ప్రతి ఒక్కరూ తన నెల సంపాదనలో కనీసం 20% సేవింగ్ చెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది. సేవింగ్ ఎలా చేయాలి సేవింగ్ ఎలా చెయ్యాలి లేక ఎక్కడ చెయ్యాలి అన్న విషయం ముందుగా మనం తెలుకోవలి, అంతే కాదు అంతకు మనం దేనికోసం సేవింగ్ చేస్తున్నాము ఎంత  సేవింగ్ చెయ్యాలి అన్న విషయాన్ని మీరు బేరీజు వేసుకోవాలి. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణం లో రాబోయే కాలంలో ఎలాంటి కర్చులు ఉంటాయి అన్నదాన్ని ముందే వూహించి వాటికి అనుగుణంగా మన సేవింగ్ అన్నది ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు నీకు రీసెంట్ గా వివాహం జరిగింది అనుకుందాం, నెక్స్ట్ ఒకటి రెండు సంవసరం లో మీకు సంతాన కలుగవచ్చు , కాబోయే తల్లి మూడో నెల నుంచి ప్రతి నెల డాక్టర్స్ నీ సంప్రదించాలి దానికి మరియు  9 వనెలలో కాన్పుకు డబ్బులు అవసరం అవుతాయి తరువాత సంవత్సరం కి మొదటి బర్త్డే, 3 సంవత్సరాలకు పిల్లల చదువులకోసం మరికొంత డబ్బు కావాలి ఇలా మీకున్న భాద్యతలు బట్టి మీరు ఎంత  డబ్బు అవసరం...

డబ్బు ఇన్వెష్ట్ చేయడం అవసరమా?

ఒక వ్యక్తి డబ్బుని తనకున్న జాబ్ ద్వారా సంపాదిస్తూ ఉంటారు కానీ  సంపాదించిన డబ్బుని ఎలా ఇన్వెష్ట్ చేయాలి అన్న ఆలోచన ఉండదు, మొత్తం సంపాదన ఖర్చు చేస్తూ తరువాత కాలంలో ఇబ్బంది పడుతుంటారు, లేక సంపాదించిన మొత్తాన్ని డబ్బూరూపంలోనే తనవద్ద లిక్విడ్ క్యాష్ పెట్టుకునేవారు మరి కొందరు, ఇలా పూర్తి ఖర్చు చేసిన లేక డబ్బు మొత్తం చేతిలో పెట్టుకొన్న ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు : ఒక తండ్రి తన ఇద్దరు కుమారులు రామ్, సోము లకి ఒకరికి ఒక లక్ష రూపాయల చొప్పున ఇచ్చాడు అందులో రము తన లక్ష రూపాయల తో బంగారం 10 గ్రాములు కొన్నాడు, సోము తన లక్ష తన దగ్గరే ఉంచుకున్నాడు ఇలా పది సంవత్సరాల తరువాత  బంగారం విలువ పెరిగి రామ్ బంగారం 10 లక్షల కు పెరిగింది కానీ సోము దగ్గర మాత్రం అప్పటి లక్ష అలాగే ఉంది అతను ఇన్వెష్ట్ చేయకపోవడం వల్ల అతని సంపాదనలో ఎటువంటి మార్పు లేదు.

డబ్బు సంపాదించే వ్యక్తుల వర్గీకరణ-2

మీరు డబ్బు ను ఎన్ని విధాలు గా సంపాదిస్తారు అన్నది క్రిత బ్లాగు లో తెలుసుకున్నారు, ఇప్పుడు మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారు అన్నది కూడా ఒక అవగాహన వచ్చి ఉంటది, ఇప్పుడు మీకు మీరు ఒక సారి పరిశీలన చేసుకోండి , మీరు ఏదైనా ఒక  రెస్టరెంట్ లోకి వెళ్లి మెనూ లో బిల్ చూడకుండా ఆర్డర్ చెయ్యగలరా, షాపింగ్ మాల్ లో అమౌంట్ చూడకుండా బట్టలు కొనగలరా అంటే చాలామంది లేదు అనే అంటారు ఎందుకు అంటే మనకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం కారణం, ఇప్పుడు మీరే పై నాలుగింటిలో ఉద్యోగం ద్వారా కానీ లేక స్వయం ఉపాధి ద్వారా సంపాదిస్తూ ఉంటే మీరు ఇక్కడినుంచి బిజినెస్స్ లేదా ఇన్వెస్టర్ గా ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. దానికోసం కృషి చేయాలి, మీరు పని చేయక పోయినా  నీ సంపాదన ఆగరాదు అంటే ఏమి చెయ్యాలి అని వాటి కోసం వెతకాలి. ఇలా పని చేయక పోయినా వచ్చే ఇన్కమ్ నీ పాసివ్ ఇన్ కమ్ అంటారు. పని చేస్తేనే వచ్చే ఇన్ కమ్ నీ ఆక్టివ్ ఇన్ కమ్ అంటారు. 

డబ్బు సంపాదించే వ్యక్తుల వర్గీకరణ

రాబర్ట్ కియోసాకి అనే ఒక పుస్తక రచయిత  డబ్బు సంపాదించే వారిని నాలుగు రకాలుగా విభజించాడు . 1 . ఉద్యోగం ద్వారా  (Employee) 2 . స్వయం ఉపాధి ద్వారా  (Self Employee) ౩. బిజినెస్ ద్వారా  (Business) 4 . ఇన్వెస్ట్మెంట్ ద్వారా  (Investment) 1 . ఉద్యోగం ద్వారా  ఒక వ్యక్తి ఒక సంస్థ వద్ద కానీ లేక ఒక వ్యక్తి వద్ద కానీ తాను పని చేస్తూ జీతాన్ని తీసుకొనే వ్యక్తిని ఎంప్లొయీ లేక ఉద్యోగి అని అంటారు , ఇక్కడ ఇతను శారీరక శ్రమవలన కానీ మేధోసంపత్తుని కానీ ఇతరులకొరకు ఉపయోగిస్తూ  నెల లేదా వార లేదా సంవత్సర జీతానికి పనిచేస్తుంటాడు , ఇతనికి పని చేస్తేనే డబ్బులు వస్తాయి లేకుంటే రావు దీనిని సాధారణ ఇన్కమ్ అంటారు. 2 . స్వయం ఉపాధి ద్వారా  స్వయం ఉపాధి అంటే ఇక్కడ ఇతనికి ఒక సొంత షాపు నుండి కానీ లేక ఇంటివద్ద నుంచి కానీ తనకు తెలిసిన పని ద్వారా తనకు వీలైన సమయంలో పని చేసుకొని జీవనం చేస్తూ ఉంటాడు , ఇక్కడ ఇతనికి స్వాతంత్రము ఉంటాది, ఇతను పని చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాడు లేకుంటే లేదు , ఇతని ఆదాయానికి ఇతనే టార్గెట్ పెట్టుకోవచ్చు , ఎంత ఎక్కువ పని చేసుకుంటే అంత సంపాదన ఉ...

డబ్బు నిజంగా అవసరమా?

డబ్బు నిజంగా అవసరమా? ప్రతి ఒక్కరి మదిలో కనీసం ఒక్కసారైనా మెదిలే ప్రశ్న డబ్బు లేకుండా జీవించలేమా, డబ్బు అవసరమా అని దీనికి ఒక్క వాఖ్యం లో సమాధానం చెప్పడం చాలా కష్టము. పూర్వపు రోజులలో డబ్బు అనేది అసలు లేదు కానీ జీవించారు కానీ కాల క్రమేణా జరిగిన పరిణామ క్రమం లో మానవులు వస్తు మార్పిడి కోసం డబ్బు ను తయారు చేయడం జరిగింది , ఇప్పుడు అది లోకాన్ని తన గుప్పిటలో పెట్టుకొంది , పుట్టుక నుంచి చావు వరుకు ప్రతీది డబ్బుతో కూడుకొన్నది గా మారింది కనుక మనిషికి కనీస డబ్బు అవసమవుతుంది.

మనీ ప్రాముఖ్యం

మనీ ప్రాముఖ్యం మానవ జీివితంలో మనీ ది అతి ముఖ్యమైన పాత్ర, మానవుడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు శ్వాస ఎలా అవసరమో ఎలా నేటి సమాజంలో మనీ కూడా అంత ముఖ్యమైనది, కనుక దానిని సంపాదించటం కోసం మనిషి నిత్యం పరుగులు పెడుతుంటాడు. నేను ఈ బ్లాగులో నాకు తెలిసిన మనీ సంపాదన మార్గాలు మరియు డబ్బు ను ఎలా ఎక్కడ ఇన్వెష్ట్ చెయ్యాలి అనే వాటి గురించి పోస్ట్ చేయటం జరుగుతంది.  బ్లాగ్ ను సందర్శించినందుకు కృతజ్ఞతలు.