Skip to main content

డబ్బు ఇన్వెష్ట్ చేయడం లో మొదటి మెట్టు.

ఒకటే సారి కోట్లు సంపాదించటం ఎవరివల్లా కాదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టకోవాలి, ఏ ప్రయాణం అయిన మొదటి అడుగు నుంచే ప్రారంభం అవుతుంది అలాగే డబ్బు పోగుచెయ్యడం అనేది కూడా ఒక్క రూపాయి నుంచే మొదలు అవుతుంది.
ప్రతి ఒక్కరూ తన నెల సంపాదనలో కనీసం 20% సేవింగ్ చెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది.

సేవింగ్ ఎలా చేయాలి

సేవింగ్ ఎలా చెయ్యాలి లేక ఎక్కడ చెయ్యాలి అన్న విషయం ముందుగా మనం తెలుకోవలి, అంతే కాదు అంతకు మనం దేనికోసం సేవింగ్ చేస్తున్నాము ఎంత  సేవింగ్ చెయ్యాలి అన్న విషయాన్ని మీరు బేరీజు వేసుకోవాలి.

ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణం లో రాబోయే కాలంలో ఎలాంటి కర్చులు ఉంటాయి అన్నదాన్ని ముందే వూహించి వాటికి అనుగుణంగా మన సేవింగ్ అన్నది ప్లాన్ చేసుకోవాలి.

ఉదాహరణకు నీకు రీసెంట్ గా వివాహం జరిగింది అనుకుందాం, నెక్స్ట్ ఒకటి రెండు సంవసరం లో మీకు సంతాన కలుగవచ్చు , కాబోయే తల్లి మూడో నెల నుంచి ప్రతి నెల డాక్టర్స్ నీ సంప్రదించాలి దానికి మరియు  9 వనెలలో కాన్పుకు డబ్బులు అవసరం అవుతాయి తరువాత సంవత్సరం కి మొదటి బర్త్డే, 3 సంవత్సరాలకు పిల్లల చదువులకోసం మరికొంత డబ్బు కావాలి ఇలా మీకున్న భాద్యతలు బట్టి మీరు ఎంత  డబ్బు అవసరం అన్నదాన్ని బేరీజు వేసుకొని దానికి అనుగుణంగా డబ్బును పోగుచేసుకోవాలి.

Comments