రాబర్ట్ కియోసాకి అనే ఒక పుస్తక రచయిత డబ్బు సంపాదించే వారిని నాలుగు రకాలుగా విభజించాడు .
1 . ఉద్యోగం ద్వారా (Employee)
2 . స్వయం ఉపాధి ద్వారా (Self Employee)
౩. బిజినెస్ ద్వారా (Business)
4 . ఇన్వెస్ట్మెంట్ ద్వారా (Investment)
1 . ఉద్యోగం ద్వారా
ఒక వ్యక్తి ఒక సంస్థ వద్ద కానీ లేక ఒక వ్యక్తి వద్ద కానీ తాను పని చేస్తూ జీతాన్ని తీసుకొనే వ్యక్తిని ఎంప్లొయీ లేక ఉద్యోగి అని అంటారు , ఇక్కడ ఇతను శారీరక శ్రమవలన కానీ మేధోసంపత్తుని కానీ ఇతరులకొరకు ఉపయోగిస్తూ నెల లేదా వార లేదా సంవత్సర జీతానికి పనిచేస్తుంటాడు , ఇతనికి పని చేస్తేనే డబ్బులు వస్తాయి లేకుంటే రావు దీనిని సాధారణ ఇన్కమ్ అంటారు.
2 . స్వయం ఉపాధి ద్వారా
స్వయం ఉపాధి అంటే ఇక్కడ ఇతనికి ఒక సొంత షాపు నుండి కానీ లేక ఇంటివద్ద నుంచి కానీ తనకు తెలిసిన పని ద్వారా తనకు వీలైన సమయంలో పని చేసుకొని జీవనం చేస్తూ ఉంటాడు , ఇక్కడ ఇతనికి స్వాతంత్రము ఉంటాది, ఇతను పని చేసుకోవాలి అనుకుంటే చేసుకుంటాడు లేకుంటే లేదు , ఇతని ఆదాయానికి ఇతనే టార్గెట్ పెట్టుకోవచ్చు , ఎంత ఎక్కువ పని చేసుకుంటే అంత సంపాదన ఉంటాది .
కానీ ఏదయినా ప్రమాదవశాత్తు కొన్ని రోజులు పని చేయకపోతే ఇతని ఇన్కమ్ (ఆదాయం ) ఆగిపోతాది.
౩. బిజినెస్ ద్వారా
ఇక్కడ ఇతను ఒక పనిని తనకు ఉన్న వనరులలో ఎంత తొందరగా ఇతరులతో చేయించుకొని తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు , దానికోసం ఇతను ఒక సిస్టమ్ ను ఏర్పరచుకొని తాను ఉన్నా లేకపోయినా తన పని మాత్రం ఆగకుండా ఉద్యోగుల ద్వారా లే క యంత్రాల ద్వారా పని చేయించుకొని కొద్దీ పెట్టుబడి తో కొద్దీ కాలంలోనే ధనవంతులుగా ఎదుగుతారు. ఇక్కడ వీరికి స్వాతంత్య్రం తో పాటు తాను పని చేయకపోయినా ఆదాయం మాత్రం ఆగదు కనుక ఆర్ధిక స్వాతంత్ర్యం కూడా ఉంటాది .
౩. ఇన్వెస్ట్మెంట్ ద్వారా
ఇక్కడ డబ్బే డబ్బును సంపాదిస్తుంది , ఎవరు పని చేయరు , ఒక వక్తి తనకున్న సంపదను వడ్డీ ద్వారా గాని లేక వేరే కంపెనీ లలో పెట్టుబడి పెట్టడంద్వారా డబ్బును సంపాదిస్తారు , దీని బాగా డబ్బు ఉండాలి , వీళ్ళు మామూలుగా రియల్ ఎస్టేట్ లో , షేర్స్ లో , బాండ్స్ , గోల్డ్ , ల్యాండ్ లీజ్ , లేదా హౌస్ రెంట్స్ ఇలా ఎన్నో విధాలుగ తనకున్న సంపదతో ఇంకొంచెం సంపదను పొందుతుంటారు. వీళ్ళు కూడా బిజినెస్ మ్యాన్ లగే ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటారు .
ఇలా పై నాలుగు విధానాలలో ఎదో ఒక విధానంలో మీరు కూడా డబ్బుని సంపాదిస్తుంటారు , ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు మీరు ఏ విధానంలో డబ్బు సంపాదిస్తున్నారో మీకు అర్థం అవుతుంది .

Comments
Post a Comment