Skip to main content

డబ్బు సంపాదించే వ్యక్తుల వర్గీకరణ-2

మీరు డబ్బు ను ఎన్ని విధాలు గా సంపాదిస్తారు అన్నది క్రిత బ్లాగు లో తెలుసుకున్నారు, ఇప్పుడు మీరు ఏ విధంగా సంపాదిస్తున్నారు అన్నది కూడా ఒక అవగాహన వచ్చి ఉంటది, ఇప్పుడు మీకు మీరు ఒక సారి పరిశీలన చేసుకోండి , మీరు ఏదైనా ఒక  రెస్టరెంట్ లోకి వెళ్లి మెనూ లో బిల్ చూడకుండా ఆర్డర్ చెయ్యగలరా, షాపింగ్ మాల్ లో అమౌంట్ చూడకుండా బట్టలు కొనగలరా అంటే చాలామంది లేదు అనే అంటారు ఎందుకు అంటే మనకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం కారణం, ఇప్పుడు మీరే పై నాలుగింటిలో ఉద్యోగం ద్వారా కానీ లేక స్వయం ఉపాధి ద్వారా సంపాదిస్తూ ఉంటే మీరు ఇక్కడినుంచి బిజినెస్స్ లేదా ఇన్వెస్టర్ గా ఎలా ఎదగాలి అని ఆలోచించాలి. దానికోసం కృషి చేయాలి, మీరు పని చేయక పోయినా  నీ సంపాదన ఆగరాదు అంటే ఏమి చెయ్యాలి అని వాటి కోసం వెతకాలి. ఇలా పని చేయక పోయినా వచ్చే ఇన్కమ్ నీ పాసివ్ ఇన్ కమ్ అంటారు. పని చేస్తేనే వచ్చే ఇన్ కమ్ నీ ఆక్టివ్ ఇన్ కమ్ అంటారు. 

Comments